ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా పీఎస్‌ఎల్వీ సీ-53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కౌంట్ డౌన్ 26గంటల పాటు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. చరిత్రలో మొట్టమొదటి సారిగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ ఎల్ వీ) 4వ దశ భూమి చుట్టూ తిరిగే విధంగా సరికొత్త సాంకేతికతను రూపొందించారు. గురువారం స్పేస్ సెంటర్ షార్ నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి53 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలోకి సింగపూర్ కి చెందిన మూడు ఉపగ్రహాలను తీసుకు వెళ్లింది. శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన నూతన సాంకేతికతను పొందుపరిచారు. ఇది వల్ల వాతావరణానికి సంబంధించిన వివిధ పరిశోధనలు చేపడుతుంది. ఒక్క వారం వ్యవధిలో ఇస్రో చేపట్టిన రెండవ వాణిజ్య ప్రయోగం ఇది.
సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం , 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక విజయం ఇస్రో సొంతమైంది. ఈ అద్బుతమైన ప్రయోగం మన భారతీయ శాస్త్రవేతల గొప్పతనాన్ని చాటే విధంగా ఉన్నాయి. అందరీ తలెత్తుకునేలా గగణతలంలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ53 దూసుకెళ్లింది. అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ జీఎస్‌ఎల్‌వీలతోనూ ముందు ముందు మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Andhra Pradesh: PSLV-C53/DS-EO and 2 other co-passenger satellites launched from the 2nd Launch Pad, SDSC-SHAR, Sriharikota. It accompanies PSLV Orbital Experimental Module (POEM) orbiting the earth as a stabilized platform.
(Source: ISRO) pic.twitter.com/zfK8SZJcvr
— ANI (@ANI) June 30, 2022