హిజ్రాలు అంటే అందరికి ఓ రకమైన అభిప్రాయం మాత్రమే ఉంటుంది. డబ్బుల కోసం మనుషులను వేధిస్తుంటారని చాలా మంది అనుకుంటారు. అలానే వీరి విషయంలో కొన్ని కొన్ని నమ్మకలు ప్రజల్లో ఉన్నాయి. హిజ్రాలు ఆశీర్వదిస్తే.. మంచి జరుగుతుందనే చాలా మంది నమ్మతుంటారు.
హిజ్రాలు అంటే అందరికి ఓ రకమైన అభిప్రాయం మాత్రమే ఉంటుంది. డబ్బుల కోసం మనుషులను వేధిస్తుంటారని చాలా మంది అనుకుంటారు. అలానే వారిని చాలా చులకన భావంతో చూస్తూ అవమానాలకు గురి చేస్తుంటారు. ఎక్కడో కొందరు హిజ్రాలు చేసే చెడు పనులకు అందరిని అలానే చూస్తున్నారు. ఇలాను చులకానగా చేసే వారు ఒకవైపు అయితే.. హిజ్రాలు ఆశీర్వదిస్తే.. మంచి జరుగుతుందనే నమ్మకం కలిగిన వాళ్లు మరోవైపు ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు నిజమా? అబద్ధమా?.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద చెరువు గట్టుపై ప్రయాణం చేసేవారికి శ్రీ విజయసాగర దుర్గామల్లేశ్వరి స్వామి ఆలయం దర్శనమిస్తుంది. అందులో నిర్వహకుల నుంచి పూజరుల వరకు అందరూ హిజ్రాలే. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల పేరుపై అర్చన చేస్తారు. అలానే అమ్మవారికి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తుంటారు. నిండు మనస్సుతో అమ్మవారికి సేవ చేస్తూ.. ఆధ్యాత్మిక చింతనలో జీవితం గడుపుతున్నారు. భక్తులు ఇచ్చే కానుకలను సమాజ సేవకు వినియోగిస్తూ.. మానవసేవే మాధవ సేవగా ముందుకు వెళ్తున్నారు.
హిజ్రాలు ఆశీర్వదించిన, ఎదురు వచ్చిన మంచి జరుగుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు. రాజుల కాలం నుంచి హిజ్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజులకు సలహాదారులగా కూడా వీరు పని చేసే వారు. పరిపాలనలో లోటుపాట్లను, ప్రజల అభిప్రాయాలను రాజుకు తెలియజేయడంలో వీరిదే కీలక పాత్ర. అలానే హిజ్రాలు ఆశీర్వదించినా, ఎదురొచ్చినా శుభం కలుగుతుందన్నది నానుడి. పూర్వకాలం నుంచి ఎంతో మంది ఈ మాటను బలంగా నమ్ముతుంటారు. ఎందుకంటే వారు నిస్వార్ధంతో ఆశీర్వదిస్తారని, వారి పుణ్యఫలం ఆశీర్వాదం రూపంలో అందుతుందని నమ్ముతారు.
అయితే ఇటీవల కొందరు హిజ్రాలు బలవంతపు వయస్సులు చేయడం వలన వారిపై ఓ నెగిటీవ్ అభిప్రాయాం ఏర్పడుతుంది. హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారు ఒకవైపు ఉన్నారు. ఆ నమ్మకాన్ని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు. అయితే హిజ్రాలు ఎదురు వస్తే.. ఆశీర్వదిస్తే శుభంగా జరుగుతుందనేది.. నమ్మకాలపై ఆధార పడిందే తప్ప.. ఈ విషయంలో ఎటువంటి నిరూపణలు లేవు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.