cyclone asani: ‘‘అసని’’ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టిస్తోంది. ఈ తుఫాను గాలుల కారణంగా కర్నూలులో భారీగా బొప్పాయి పంట నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వృక్షాలు నేల కొరిగాయి. తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసని తుఫాన్ పై విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ ఓ ప్రకటన చేశారు. అసని తుఫాన్ కాకినాకు ఆగ్నేయంగా 260 కి.మీ దూరంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ తుఫాన్ మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోందని, దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుఫాన్ తీరం దాటడంపై ఇంక ఎలాంటి స్పష్టత రాలేదని, తీరం దాటకుండానే బలహీన పడే అవకాశముందని పేర్కొన్నారు. మరి, ఏపీని ఇంతలా వణికిస్తున్న ఈ తుఫానుకు ‘‘ అసని ’’ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరు పేరు పెట్టారు? ఎందుకు పేరు పెట్టారు? ఇంతకీ ‘‘అసని’’ అంటే అర్థం ఏమిటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
‘‘అసని’’ అంటే అర్థం ఇదే..
బంగాళఖాతంలో ఏర్పడే తుపాన్‌లకు దాని చుట్టూ ఉండే దేశాలు వంతుల వారీగా నామకరణం చేస్తున్నాయి. ఈసారి తుపాన్‌కు పేరు పెట్టే అవకాశం శ్రీలంకకు వచ్చింది. ప్రస్తుత తుఫాన్‌కు శ్రీలంక ‘‘ అసని’’ అని సింహళ భాష పేరును పెట్టింది. సింహళ భాషలో అసని అంటే కోపం, ఆగ్రహం అని అర్ధం వస్తుంది.
తుఫాను పేరు పెట్టాలంటే ఇవి తప్పని సరి..
తుఫాన్లకు పేరు పెట్టాలంటే కొన్ని గైడ్‌లైన్స్ పాటించాలి. వాటిని దృష్టిలో ఉంచుకుని వంతు వచ్చిన దేశం పేరు పెట్టాలి. సభ్య దేశాలతో ఏర్పడిన ప్యానెల్ ఆ పేరును పరిశీలించి ఫైనల్ చేస్తుంది.
1) తుఫాను పేరు రాజకీయాలు, మతాలు, సాంప్రదాయాలు, లింగాలకు తటస్థంగా ఉండాలి.
2) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క ప్రజల సెంటిమెంట్స్‌ను పేరు బాధించకూడదు.
3) దురుసు, క్రూరమైన పదాలను వాడకూడదు.
4) ప్రజలు పలకడానికి వీలుగా ఉండే విధంగా చిన్నగా ఉండాలి.
5) తుఫాను పేరు గరిష్టంగా ఎనిమిది అక్షరాలను మాత్రమే కలిగి ఉండాలి.
6) ఒకసారి పెట్టిన పేరు మరోసారి పెట్టకూడదు.
మరి, ‘‘అసని’’ తుఫానుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘అసని’ తుపాన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.