భారత దేశం అన్ని రంగంలో ముందుకు సాతుగుతుంది. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అంతరిక్ష పరిశోధనలో రంగంలో తనదైన మార్క్ చాటుకుంటుంది ఇస్రో. ఈ క్రమంలోనే నేడు సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. భారత దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రాకేట్ ని ప్రయోగించి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన విక్రమ్ సబార్టియల్ శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 11.30 లకు విజవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లింది.
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైదరాబాద్ కి చెందిన స్కైరుట్ ఏరోస్పేస్ కి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ విక్రమ్ – ఎస్ రాకెట్ ని అభివృద్ది చేసింది. ఈ నేపథ్యంలో శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన నుంచి మిషన్ ప్రారంభ్ విజయవంతం అయ్యిందని ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఈ రాకెట్ మొత్తం బరువు దాదాపు 545 కేజీలు ఉంటుందని.. విక్రమ్ – ఎస్ ప్రైవేట్ రంగంలో రూపొందిన తొలి రాకెట్. అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యుడైన డాక్టర్ విక్రమ్ సారాబాయ్ పేరిట విక్రమ్ – ఎస్ అని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారత దేశ చరిత్రలో ఇదో సువర్ణణ అధ్యాయనం అని.. తొలి ప్రైవేట్ రాకెట్ ని నింగిలోకి పంపడం ఇదే తొలిసారి అని.. అంతరిక్ష రంగంలో ఉనికి పెంచుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. ఇక ఇస్త్రో చైర్మన్ సోమ్ నాథ్ మాట్లాడుతూ.. తొలిసారి ప్రైవేట్ రాకేట్ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధకులు గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతుందని.. మిషన్ ప్రారంభ్ విజయవంతానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞాతు తెలిపారు. మును ముందు మరిన్ని పరిశోధనలు జరిపేందుకు ఇది ఎంతో ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
🇮🇳
CONGRATULATIONS #ISRO!!India’s first ever private rocket Vikram-S, named after Vikram Sarabhai, launched from #Sriharikota.@isro #ISRO #VikramS pic.twitter.com/HwpxXEqV7k
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) November 18, 2022