గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజు క్రితం పడిన భారీ వర్షం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఆ దెబ్బనుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజు క్రితం కూడా పడ్డ భారీ వర్షం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఆ దెబ్బనుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. రానున్న రోజుల్లో కూడా భారీ వానలు కురవనున్నట్లు ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరించాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాయి. ఓవైపు పగలు మండే ఎండలు, మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖలు ఈ హెచ్చరికను జారీ చేశాయి.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వడగళ్ల వాన ముంచెత్తింది. తాజాగా మరోసారి రెయిన్ కి సంబంధించిన ఓ వార్త తెలుగు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏర్పడిన ద్రోణి పశ్చిమ విదర్భ నంచి మరట్వాడ, కర్ణాట వరకు వ్యాపించి ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అలానే మే తొలివారంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ గాలుతో కూడి వర్షాలు కురవనున్నాయి. అలానే ఉత్తర తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్, మెదక్ , సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో కూడా ఈదురుగాలుతో కూడిన వర్షాలు విస్తారంగా పడనున్నట్లు తెలుస్తోంది. ఇది మే తొలివారం అంతా ఉండొచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోఈదురుగాలుల, ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాక తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపారు. మరి.. రెయిన్ అలెర్ట్ కు సంబంధించిన ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.