'ఈ ఐటమ్స్ తింటే రూ.లక్ష మీవే..!' అంటాడేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది వాస్తవం. మీరు చేయాల్సిందల్లా.. కూర్చొని కడుపుబ్బా తినడమే. దీనికోసం ఎక్కడికో పోవట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో 20కి పైగా బ్రాంచులున్నాయి. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. తినొచ్చు.. లక్ష గెలవచ్చు. ఎలా..? ఏంటి ఈ పోటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాపారం చేయాలని, బాగా సంపాదించాలని అందరికి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నంలో కొందరే రాణించగలరు. ఎందుకంటే.. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి కొన్ని చిట్కాలుంటాయి. అలాంటి ప్రయత్నమే ఇది. ’30 రకాల వంటకాలను.. 30 నిమిషాల్లో తింటే లక్ష రూపాయల బహుమతి..’ ఇది ఒక రెస్టారెంట్ వారు పెట్టిన ఆఫర్. వాస్తవంగా ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ.. అదే వారిని విజయపథంలో నడిపిస్తోంది. ‘మేము తింటాం.. లక్ష గెలుస్తాం..’ అంటూ తినడానికి బోలెడు మంది పోటీపడుతున్నారే తప్ప.. ఇప్పటివరకు గెలిచిన వారు మాత్రం ముగ్గురే. ఒకవేళ మీరు బాగా తినగలవారైతే.. లక్ష సొంతం చేసుకోవచ్చు.. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
ఈ రోజుల్లో బాహుబలి థాలీ అనే పేరు బాగా వినపెడుతోంది. 30 రకాల వంటకాలను ఒక పెద్ద ప్లేట్ లో వడ్డిస్తారు. ఇందులో ఒక కుండ బిర్యాని, ఫిష్, నాటుకోడి, ఆమ్లెట్, గుడ్డు, చికెన్ అంతేకాక చికెన్ తో చేసిన వివిధ రకాల వంటకాలు, రెండు గ్లాసుల లస్సి, రెండు కూల్ డ్రింక్స్.. ఇలా మొత్తం 30 రకాల వంటకాలు అందిస్తారు. ఈ ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరించవచ్చు. వీటన్నిటిని ఎవరైతే 30 నిమిషాల్లో తినగలరో.. వారికి లక్ష రూపాయలు బహుమతి. ఇన్ని ఐటమ్స్ సింగిల్ సిట్టింగ్ లో ఆరగించాలి అంటే ఎంత భోజన ప్రియుడికైనా అసాధ్యమే. అయినప్పటికీ ముగ్గురు యువకులు ఇప్పటికే.. ఈ ప్రయత్నంలో గెలిచి లక్ష సంపాదించారు. కావున మీరు కూడా ఒకసారి లక్ష గెలిచే అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ ఛాలెంజ్ నిర్వహించే ‘నాయుడు గారి కుండా బిర్యాని‘ రెస్టారెంట్ వారు కొత్తగా అనంతపురంలో ఓ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఈ పేరు మరోసారి వైరలవుతోంది. హైదరాబాద్ లో కూడా ఈ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్లి మీ సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.