అందాల పోటీలు అనగానే ఎక్కువగా ఉత్తరాది వారే అన్న ఆలోచన మనసులో మెదులుతుంది. కానీ ఈ మధ్య కాలంలో.. తెలుగు యువతులు కూడా అందాల పోటీల్లో పాల్గొని.. సత్తా చాటుతున్నారు. తాజాగా తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఆ వివరాలు..
ఒకప్పుడు అందాల పోటీలు అంటే.. కేవలం మెట్రో నగరాల్లో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా ఉత్తరాది వారు మాత్రమే పాల్గొంటారు అనే భావన ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ అభిప్రాయం కూడా మారుతూ వస్తోంది. ప్రస్తుతం కాలంలో తెలుగు అమ్మాయిలు కూడా మోడలింగ్, సినిమాలు, అందాల పోటీల్లో సత్తా చాటుతున్నారు. నటి శోభిత ధూళిపాళ్ల గతంలో మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని.. ప్రస్తుతం సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని.. రికార్డు సృష్టించింది. ఆ వివరాలు..
ఐకాన్ మిస్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరికి చెందిన యువతి భావన విజేతగా నిలిచింది.. కిరీటం గెలుచుకుంది. ముంబైలో జరిగిన ఈ పోటీల్లో భావన మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక భావన గురించి చెప్పాలంటే.. ఆమె స్వస్థలం తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి. ప్రస్తుతం ఆమె తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. భవిష్యత్తులో సైంటిస్ట్ కావటమే తన లక్ష్యం అని ఆమె చెప్పింది. భావన తల్లి గృహిణి, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమె గతంలో డైరెక్టర్ శ్రీను దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కిరీటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది భావన. మిసెస్ ఇండియా రైజింగ్ స్టార్ సుప్రజా చౌదరి శిక్షణతో.. తన తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది భావన.
ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ.. ‘‘ఈ టైటిల్ గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా జీవితంలో మరచిపోలేని సంతోషకరమైన ఘటన. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 1000 మంది టైటిల్ కోసం పోటీపడ్డారు. వారిలో చివరి స్క్రీనింగ్‌కు 300 మంది ఎంపిక అవ్వగా.. నేను టాప్-20లో కూడా నిలిచాను. ఇక ముంబైలో నాలుగు రోజులు పాటు ఉత్కంఠగా జరిగిన ఫైనల్స్‌లో నేను మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలవడం ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకం’’ అని తెలిపింది. మరి తెలుగు యువతి సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.