ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టార్ చాలా కీలకమైనది. ఈ సెక్టార్ లో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఈ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏటీఎం సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు సంబంధించిన వినియోగదారులపై ఛార్జీల ప్రభావం పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని సమాచారం.ఐసీఐసీఐ బ్యాంక్.. ఏటీఎం లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలను సవరించింది.
నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచి ఐదు సార్లు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత జరిగే ప్రతి క్యాస్ విత్ డ్రాకి రూ.21 ఛార్జీ పడుతుంది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి వర్తిస్తాయి. ఆర్థికేతర లావాదేవీలు ఉచితం. ఐసీఐసీఐ వినియోగదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలో మెట్రో నగరాల్లో అయితే నెలకు మూడు సార్లు, ఇతర పట్టణాల్లో అయితే ఐదు సార్లు ఉచితంగా క్యాస్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఆర్థికేతర లావాదేవిలు కూడా ఇందులో కలిపే ఉంటాయి. పరిమితి దాటి ట్రాన్సాక్షన్లు జరిగితే ప్రతిసారి రూ.21 ఛార్జీ పడుతుంది.ఇక ఆర్థికేతర లావాదేవిలు పరిమితిదాటితే ప్రతి లావాదేవీకి రూ.8.5 అదనపు ఛార్జీ పడుతుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ బాటాలోనే ఛార్జీలు ప్రకటించిన్నట్లు సమాచారం.యాక్సిస్ బ్యాంక్ కూడా లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్డ్రా చేస్తే రూ.21 చార్జీ వసూలు చేయనుంది.ఈ రెండు బ్యాంకులు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.