ఏపి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు నగరి ఎమ్మెల్యే రోజా. ఓ వైపు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ.. రాజకీయాలతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాల వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించగానే తాను చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయని తెలిపారు. ‘నేనూ ఈ కాలేజ్ విద్యార్థినే.. గుర్తుకొస్తున్నాయి.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను చదువుకున్న విద్యా సంస్థకే నేను గెస్ట్‌గా రావడం ఆనందంగా ఉంది’ అంటూ ఆమె ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నేను చదువుకున్న విద్యాసంస్థకే నేను గెస్ట్ వెళ్లడం ఆనందంగా ఉంది. కాలేజ్ ప్రాంగణంలోకి ప్రవేశించగానే.. నేను చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి. తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. pic.twitter.com/MxoltAlBgw
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 5, 2022