టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. కుప్పం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు కలిసి నడుస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ చోట ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలో జనం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి బొట్టు పెట్టారు.
ఓ మహిళ ఎంతో ప్రేమగా లోకేష్‌ను ముద్దు కూడా పెట్టుకుంది. లోకేష్‌తో సెల్ఫీలు దిగటానికి సైతం జనం ఎగబడ్డారు. లోకేష్ ఎంతో ఓపిగ్గా అందరికీ సెల్ఫీలతో పాటు షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చి అక్కడినుంచి కదిలి వెళ్లారు. ఇక, గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతుల జంట చేతిలో నెలల చంటి బిడ్డతో లోకేష్ దగ్గరకు వచ్చారు. దంపతులు కోరిక మేరకు లోకేష్ చంటిబిడ్డకు శాన్విత అని పేరు పెట్టారు. కాగా, లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం 11 .03 గంటలకు ప్రారంభం అయింది.
యాత్ర ప్రారంభం సందర్భంగా లోకేష్ తన మామ బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు మద్దతు తెలపటానికి పెద్ద ఎత్తున జనం, టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ఆయనతో పాటు కలిసి నడిచారు. ఇక, రెండో రోజు యాత్ర కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మరి, లోకేష్ యువగళం పాదయాత్రకి వస్తున్న అనూహ్య స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.