తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకటి మరవక ముందే మరొకటి చోటుచేసుకోవడం, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఉంటుండడం అటు ప్రజలను, ఇటు అధికారాలను కలవర పాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అచ్యుతాపురం సెజ్‌లోని లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడం, భారీ శబ్ధం రావడంతో.. కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంంది హూటాముటిన ఘటానాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తుస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.