ఎండాకాలం మొదలైందీ మొదలు.. వేడి, ఉక్కపోతతో సచ్చిపోతుంటాం. అయితే ఇటీవల వాతావరణంలో మార్పులు విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరో వైపు ఉన్నపళంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి.
వర్షాకాలం వచ్చినంత సేపు.. ఎప్పుడు చలికాలం వస్తుందా అని అనుకుంటాం. చలికాలం వచ్చాక బాబోయ్ ఈ చలిని తట్టుకోలేకపోతున్నాం.. ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అని ఆలోచిస్తాం. తీరా ఎండాకాలం వచ్చాక.. ఆ వేడిని తట్టుకోలేక.. కొంచెం వర్షమైనా పడితే చాలురా భగవంతుడా అని భావిస్తుంటాం. ఎండాకాలం మొదలైందీ మొదలు.. వేడి, ఉక్కపోతతో సచ్చిపోతుంటాం. అయితే ఇటీవల వాతావరణంలో మార్పులు విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరో వైపు ఉన్నపళంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండాకాలం మొదలై నెల పదిహేను రోజులు అవుతున్నాయో లేదో.. బయటకు రావాలంటే బయపడి చస్తున్నారు ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వింత వాతావరణమే నెలకొంది. ఒక వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. హమ్మయ్యా అనుకునే లోపు మళ్లీ ఎండలు ముంచెత్తుతున్నాయి. ఉదయం 9 గంటల నుండే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక విజయవాడ వంటి ప్రాంతాల్లో అయితే ఎనిమిది గంటల నుండి సూరీడు ఇళ్లల్లోకి చొరబడుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో వడగాలులు తోడై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది. రోజు రోజుకు వడగాలులు పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎన్నడు లేని విధంగా 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జనాలు వడదెబ్బ బారిన పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ నుండి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.