Rajampet: ఓ ఏబీవీపీ నాయకుడి చెంపను చెళ్లుమనిపించారు ఓ మహిళా హెచ్‌ఎమ్. పరుష పదజాలంతో మాట్లాడినందుకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజంపేటలో బంద్ ఎలా జరుగుతోందో చూడ్డానికి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ ఒక్కో పాఠశాల దగ్గరకు వెళుతూ ఉన్నారు.
ఈ సందర్బంగా రాజంపేట బాలికోన్నత పాఠశాల దగ్గరికి వెళ్లగా పాఠశాల తెరిచి ఉంది. దీంతో విద్యార్థులను వెంటనే ఇంటికి పంపేయాలని అశోక్.. పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీదేవిని కోరారు. విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి స్కూలుకు సెలవు ఇస్తామని హెచ్‌ఎమ్ బదులిచ్చారు. అందుకు అశోక్ ఒప్పుకోలేదు. విద్యార్థులను వెంటనే పంపాలన్నారు. అలా విద్యార్థులను పంపితే, వండిన భోజనం పాడవుతుందని లక్ష్మీదేవి అన్నారు.
చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లి ఉంటారని, ఇప్పుడు వారు ఇళ్లకు వెళితే పస్తులు ఉండాల్సి వస్తుందని తెలిపారు. అయినప్పటికి అశోక్ వినిపించుకోకుండా.. ‘మీకు మెంటలా?.. చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అంటూ పరుష పదజాలం వాడారు. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మీదేవి అతడి చెంప చెళ్లుమనిపించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నా కొడుకును చంపేయండి.. కోర్టును ఆశ్రయించిన తల్లి!