ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండ పాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండ పాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన రోడ్డు షోను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద యెత్తున నినాదాలు చేపడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు మంత్రి ఆది మూలపు సురేశ్ కార్యాలయం వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘర్షణలతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్ర బాబు నాయుడు ఈ రోజు ఎర్రగొండ పాలెంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పర్యటనను వ్యతిరేకిస్తూ బాబు గో బ్యాక్ ప్లకార్డులు, బ్లాక్ బెలూన్స్, నల్ల జెండాలతో ఆందోళనలు చేపట్టారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. దీంతో మంత్రి ఆది మూలపు సురేశ్ కార్యాలయం వైపు టీడీపీ కార్యకర్తలు దూసుకెళుతుండగా.. వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇటు మంత్రి సురేష్ రోడ్డుపై టీ షర్టు విప్పేసి చంద్రబాబుపై ఆగ్రహంగా మాట్లాడారు. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటూ సవాలు చేశారు.
ఆయన దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ అవహేళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దళితుల ఓట్లు కావాల్సి వచ్చాయా అని ప్రశ్నించారు. దళిత ప్రజలనే కాదు.. సొంత పార్టీ దళిత నాయకులను కూడా హేళన చేస్తూ చంద్రబాబు అవమానిస్తుంటారని మంత్రి విమర్శించారు. అటువంటి వారికి ఇక్కడ తిరిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దీంతో యర్రగొండపాలెంలో హైటెన్షన్ నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో.. ఎన్ఎస్‌జీ అలెర్ట్ అయ్యింది. చంద్రబాబుకు మరింత భద్రత పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత పెంచినట్టు తెలుస్తోంది.