బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తిరుమల కొండపై కురిసిన భారీ వర్షానికి నడకదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు శ్రీవారి మెట్ల వద్ద వరద ప్రవాహం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలిపిరి మెట్ల మార్గం జలపాతాన్ని తలపిస్తుంది. భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏడుకొండల వెంకన్నకు కూడా వరద కష్టాలు తప్పలేదంటూ భక్తులు వాపోతున్నారు. కాగా తిరుమల వెళ్లే రెండు మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.