తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన కోసం వచ్చే భక్తుల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. నిన్న అర్థరాత్రి నుండి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. గత రెండు రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఈ రోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు.
రెండు రోజులు విరామం అనంతరం తిరుపతిలోని గోవింద రాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపీణీ చేశారు. గోవింద రాజస్వామి సత్రం వద్ద రాత్రి నుంచి వేచి ఉన్న భక్తులతో పాటు ఇవాళ కూడా భక్తులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కొందరు భక్తులు గాయపడ్డారు. ఈ తోపులాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. కౌంటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పిల్లలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యూలైన్ లో ఉన్న కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు భక్తులు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. అక్కడే ఉన్న తితిదే విజిలెన్స్ , పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న భక్తులను నిలువరించలేకపోయారు. టోకెన్లు పొందిన భక్తులు కూడా తమకు కేటాయించిన సమయం వరకూ తిరుపతిలో వేచి ఉండలేక తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్ధితులు నెలకొన్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.