ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా కారణాలు ఏవైనా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలుసుకొని ఓ ఎమ్మెల్యే ఆమెని ధైర్యాన్ని చెప్పి ఆ ప్రయత్నాన్ని ఆపాడు.
వివరాల్లోకి వెళితే.. మణిపురం ఫ్లై ఓవర్ పై ఆత్మహత్యాయత్నం చేసింది శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత.. ఆ సమయంలో స్థానికులు ఆమెకు ఎంతగా నచ్చజెప్పినా వినకుండా చనిపోవడానికి సిద్దమైంది. అదే సమయంలో తన ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే ముస్తాఫా విషయం తెలుసుకొని వెంటనే అక్కడకు చేరుకొని ఆ మహిళ ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు. అంతే కాదు ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన కుటుంబానికి ఇబ్బందులు ఎదురు అవుతాయని.. సమస్యలు ఎదిరించి పోరాడాలని ఆమెతోపాటు అక్కడ ఉన్న అందరికీ చెప్పారు. ఇక, కారులో ఎక్కించుకుని సదరు మహిళను తన ఇంటికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇది చదవండి : బన్నీ ఇదే ఒరిజినల్.. శ్రీవల్లిని మర్చిపోయారా!
కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని సదరు మహిళ ఎమ్మెల్యేకు తెలియజేయడంతో.. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మహిళను ఇంటికి పంపించారు ఎమ్మెల్యే ముస్తఫా. ఎమ్మెల్యే మహిళ ప్రాణాలు కాపాడినందుకు నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.