ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి పూర్తి స్థాయిలో డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే దీనిపై ఏపిలో రాజకీయ రగడ మొదలైంది.
ఇది చదవండి: పెళ్లింట విషాదం.. ప్రమాదవశాత్తు 13 మంది మృతి
ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నియమించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.