దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు తృణ ప్రాయంగా త్యాగం చేశారు. అలాంటి వారిలో అల్లూరి సీతారామరాజు ఒకరు.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినందుకు.. అతని ధైర్య సాహసాలకు గాను అతనిని మన్యం వీరుడు అని పిలుస్తుంటారు.
దేశ స్వాతంత్ర కోసం ఎంతో మంది త్యాగదనులు తమ ధన, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అలాంటి పోరాట వీరుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు. బ్రిటీషు పరిపాలనను వ్యతిరేకించి సాయుధ పోరాటం చేశాడు. తనను నమ్ముకున్న మన్యం ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేశాడు అల్లూరి సీతారామరాజు. అలాంటి వీరుడిని పట్టి ఇస్తే.. భారీ నజరానా ఇస్తామని అప్పటి ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది.. దానికి సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. బ్రిటీష్ పాలన వ్యతిరేకిస్తూ.. రెండేళ్ల పాటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసి గొరిళ్లా యుద్దంతో చుక్కలు చూపించారు అల్లూరి సీతారామరాజు. అందకే ఆయనను మన్యం వీరుడు అంటారు. మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశాడు.. వారి హక్కుల కోసం, స్వాతంత్రం కోసం పోరాడాడు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఎంతో మంది మన్యం ప్రజలకు శిక్షణ ఇచ్చి వీరులుగా తీర్చి దిద్దాడు. రెండేళ్ల పాటు బ్రిటీష్ అధికారులకు చుక్కలు చూపించాడు అల్లూరి. ఈ క్రమంలో ఆయనపై అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసిందని అంటారు.
బ్రిటీష్ ప్రభుత్వం 1924లో మన్యానికి కొత్త కలెక్టర్ రూథర్ ఫర్డ్ ని నియమించింది. రూథర్ ఫర్డ్ రాగానే.. అల్లూరి దళానికి చెందిన వారిపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు అల్లూరి సీతారామరాజును పట్టి ఇచ్చిన వారికి భారీ నజరానాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ గెజిట్.. ప్రభుత్వ ప్రకటన అంటూ.. 20-4-1923 లో అల్లూరి సీతారామరాజు ని పట్టి ఇచ్చిన వారికి రూ.10000 బహుమతి ఇవ్వబడును అని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసి వందేళ్లు దాటింది. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం.. ప్రజల కోసం పోరాడి అమవీరుడు అయ్యాడు అల్లూరి సీతారామరాజు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.