సాధారణంగా ప్రపంచంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలను చూస్తే నవ్వొస్తుంది. ఇక ఆ సంఘటనలు మన దగ్గర్లోనే జరిగితే.. అక్కడికి వెళ్లి చూసిరావాలని మనసు ఆరాటపడుతుంది కూడా. అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూర్ వైపు వెళ్తున్న రైలు పిడుగురాళ్ల రేల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే బోగీలను వదలి రైలు ఇంజన్ ఒక్కటే వెళ్లిపోయింది. ఇది గమనించిన గార్డ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బోగీలను వదిలి రైలు ఇంజన్ వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి గుంటూర్ వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల స్టేషన్ సమీపానికి రాగానే నెంబర్ 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ మాత్రమే వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డు.. అధికారులకు, రైలు డ్రైవర్ (లోకోపైలట్)కు సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఇంజన్ జానపాడు రైల్వేగేటు దాటి వెళ్లింది. సమాచారం అందడంతో డ్రైవర్ ఇంజన్ ను తీసుకుని బోగీలు ఆగిన చోటుకు వచ్చాడు. అనంతరం వాటిని మళ్లీ తగిలించుకుని వెళ్లింది ఆ రైలు. అయితే ఈ తతంగం అంతా జరిగే సరికి కొంత సమయం పట్టింది. ఈ టైమ్ లో పిడుగురాళ్ల వైపు వచ్చే ట్రైన్స్ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఘటను చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.