ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాష్ట్రాలన్ని అప్పుల పాలు చేసిందని.. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తుంటే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేస్తూ వస్తుంది అధికార పక్షం.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతూ వస్తుంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల హడావుడి కొట్టొచ్చినట్లు కనిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, సభలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక అధికార పార్టీ వివిధ పథకాలు అమలు చేస్తూ తమవైపు తిప్పుకుంటుంది. అంతేకాదు జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది. తాజాగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి.. దీంతో అధికార పార్టీ అన్ని వర్గాల వారిని దగ్గరకు చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉంది. ఇక ఏపీ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో తమ నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు కనిపిస్తుంది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ భాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగినులకు 180 రోజుల పిల్లల సంరక్షణకు ప్రస్తుతం ఇస్తున్న సెలవును తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటి వరకు చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధనలు ఉండేవి.. ఇటీవల దీనిపై పలు విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిబంధనలు సవరించి మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మద్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సీఎం జగన్ ని కలిసి మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను ఆయన దృష్టియి తీసుకు వచ్చారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాము కోరిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై ఎమ్మెల్సీలు, మహిళా ఉద్యోగినులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.