ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. వైద్యశాఖలో ఉన్న ఖాళీల భర్తీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించేందుకు 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 23 నుంచి మొదలై నవంబర్ 6న ముగుస్తుందని తెలిపారు. ఇదే కాకుండా ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారే అర్హులని తెలిపింది. దీంతో గత కొంత కాలం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటంతో జగన్ సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.