తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇది వేసవి కావడంతో ఆ రద్దీ మరింత పెరుగుతుంది. అందుకే టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల భక్తులకు టీటీడీ మరో శుభవార్త కూడా చెప్పింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఏడాదికి ఒక్కసారైనా ఆ వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఇంక డెలిగేట్స్, రాజకీయనాయకులు, సినిమా యాక్టర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ఆ శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సామాన్య ప్రజలు మాత్రం ముఖ్యంగా రూ.300 దర్శన టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ టికెట్లకు డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆన్ లైన్ లో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోతాయి. తాజాగా ఈ టికెట్లపై టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి 27న దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 29,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడు సర్వదర్శనం టికెట్ల విషయంలో భక్తులకు శుభవార్త చెప్పారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఆ సమయానికి ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలంటూ సూచించారు.
ఇప్పటికే శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి అంగప్రదిక్షణ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి భక్తులకు మరో అవకాశం ఇస్తూ టీటీడీ మార్చి 27న రూ.300 టికెట్లను విడుదల చేయనుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సమయంలో మార్పులు చేయడంతో.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే భక్తులు కోరుకున్న విధంగా వర్చువల్ టికెట్లను ఆన్ లైన్ లో కొనసాగించేందుకే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవిలో భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందు.. వీఐపీ రిఫరల్స్ తగ్గించుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.