YSR Cheyutha: ఏపీలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు సీఎం జగన్ శుభవార్త. వైఎస్ఆర్ చేయూత పథకం కింద రేపు (సెప్టెంబర్ 23న) నగదు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం వేదికగా ఈ సంక్షేమ పథకాన్ని అందజేయనుంది. జగన్ రేపు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన 45 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండే అర్హులకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏటా రూ. 18,750 చొప్పున 4 విడతల్లో రూ. 75 వేలు అందజేస్తుంది.
ఇప్పటికే రెండు విడతల్లో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులకు నిధులను విడుదల చేసిన జగన్.. రేపు మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 2020 ఆగస్ట్ లో.. మొదటి విడతగా 24,00,111 మంది అర్హుల ఖాతాల్లో రూ. 4,500.21 కోట్లు జమ చేయగా.. 2022 జూన్ 22న రెండో విడత కింద 24,95,714 మంది మహిళల ఖాతాల్లో 4,679.49 కోట్లు జమ చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మూడో విడత నిధులను రేపు విడుదల చేయనుంది. రేపు జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. కుప్పం చేరుకున్న అనంతరం జగన్.. 11.15 గంటల నుండి 12.45 గంటల మధ్యలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత బటన్ నొక్కి మూడో విడత నిధులను విడుదల చేస్తారు.
ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత 2022-2023 తుది జాబితాను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. సచివాలయ సిబ్బంది పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎన్బీఎం పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. స్థానిక వాలంటీర్ దగ్గర కూడా ఈ జాబితా ఉంటుంది. కాబట్టి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మొదటి రోజునే మీ ఖాతాల్లో నగదు జమ కాకపోతే కనుక మరుసటి రోజు వరకూ వెయిట్ చేయండి. అప్పటికీ నగదు జమ కాకపొతే సచివాలయానికి వెళ్లి.. మీరు అర్హులే అని ఆధారాలు చూపించండి. అప్పుడు మీ ఖాతాల్లో నగదు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తారు.
వాస్తవానికి ఇవాళే నగదు విడుదల చేయాల్సి ఉంది. సీఎం జగన్ ఇవాళే కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల రేపటికి (ఈ నెల 23కి) వాయిదా పడింది. రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి నిధులు విడుదల చేస్తారు. అయితే చంద్రబాబు అడ్డా అయిన కుప్పం నియోజకవర్గంలో ఈ నిధులు విడుదల చేయడంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో జగన్ సమరానికి విల్లు ఎక్కిపెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి 45 ఏళ్లు నిండిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను జమ చేయనున్న ఏపీ సీఎం జగన్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
గుడ్ న్యూస్.. రేపు వారి ఖాతాల్లో నగదు జమhttps://t.co/aU9ABX9OXw#APlatestnews #CMYSJagan #journalistsai #YSRCheyutha #kuppam pic.twitter.com/VoLwbynCwY
— Journalist Sai (@saisatya14) September 22, 2022