ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సందాన కర్తలుగా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయుటలో ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు పరుచి, అన్నిరకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ఉద్యోగులు చొరవ చూపుతారు. రాష్టంలో కానీ, దేశంలో కానీ ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వాలు అండగా ఉంటాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగలకు శుభావార్తను అందించింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వం ప్రజల కోసం తీసుకు వచ్చే సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఆదేశానుసారం అమలు పరుచుటలో ఉద్యోగులు కృషి చేస్తారు. కాగా ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు జీతభత్యాలు పెంచడం, హెచ్ ఆర్ ఎ, డిఎ లు పెంచి ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని తొలగిస్తారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎపి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సిపిఎస్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ఎపి ప్రభుత్వం తాజాగా ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇది రాష్ట్రమంతటా కాకుండా స్టేట్ లెవల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తించనుంది. సచివాలయం, హెచ్ ఒడి ఇతర స్టేట్ లెవల్ ఆఫీసుల్లో వారానికి ఐదురోజులు పనిదినాలు కొనసాగించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ లెవల్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనివేళలు ఉండనున్నాయి. రేపటి నుంచి ఏడాదిపాటు వారానికి ఐదు రోజులు పనిచేసే విధానం అమల్లో ఉండనుంది. ఇక జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.