10వ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 10వ తరగతి విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై 18 తేదీన ముగియనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు అంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ 10వ తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. విషయం ఏంటంటే?
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో బస్ పాస్ లేకున్నా.. హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులు అంతా తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఇక సమయానికి కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరింది. ఇక విద్యార్థుల పరీక్షల నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని, దీని పట్ల 10వ తరగతి విద్యార్థులకు అందరూ అవగాహన కల్పించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఈ వార్తతో ఏపీలోని 10వ తరగతి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.