ప్రతి అమ్మాయికి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. సాధారణంగా ప్రతి అమ్మాయి పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కొన్ని కారణాల కారణంగా అమ్మాయికి రెండో పెళ్లి చేస్తుంటారు తల్లిదండ్రులు. అనుకోని సందర్భాల్లో తప్ప రెండో పెళ్లి చెయ్యరు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం అమ్మాయికి మూడు సార్లు పెళ్లి చేస్తారు. అది కూడా ఆ అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గరుండి మరీ చేస్తారు. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం నిజం. మరి ఈ మూడు పెళ్లిళ్ల పద్దతి ఎక్కడ ఉంది? ఎందుకు అలా చేస్తుంటారు? ఆ మూడు పెళ్లిళ్ల వెనకున్న స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తూర్పు కనుమల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో మాలీస్ అనే గిరిజన తెగ నివసిస్తుంటారు. వారి సంప్రదాయాలు, ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి. వారికి ఆడపిల్లలంటే అమితమైన ప్రేమ. ఇక్కడ పుట్టిన ప్రతి అమ్మాయికి మూడు పెళ్లిళ్లు చేసే ఆచారం తరతరాలుగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ముందు జరిగి రెండు పెళ్లిళ్లకు వరుడు ఉండడు.
మూడో పెళ్లి మాత్రమే వరుడితో జరుగుతుంది. ముందు జరిగే ఆ రెండు పెళ్లిళ్లు ఆడపిల్లలందరికి సామూహికంగా జరిపిస్తుంటారు. పుట్టిన ఐదేళ్లలోపు ఒకసారి, యుక్తవయసు రాగానే మరోసారి పెళ్లి చేస్తారు. ఈ వివాహాలకు ఆ గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా కుటుంబాలతో సహా హాజరవుతారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ మూడు పెళ్లిళ్ల సంప్రదాయం వెనుక ఓ బలమైన కారణం ఉందని స్థానికులు తెలిపారు. ఆడపిల్లలను దేవతల్లా చూసుకోవడం వారి పూర్వీకు నాటి సంప్రదాయం.
ఆడ పిల్లలకు జరిగే అన్నీ సంబరాలు.. ఆ పాప తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉండగానే జరగాలనేది నియమం. ఆడ పిల్లలకు పెళ్లి అనేది చాలా ముఖ్యం కదా, అందుకే ఆ పెళ్లి అందరూ చూడాలనే ఉద్దేశంతోనే మాలీస్ తెగ పెద్దలు ఈ నియమం పెట్టారు. ఆడపిల్లలకు పెళ్లి వయసు వచ్చేసరికి ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే.. ఆడ పిల్ల పెళ్లి చూడలేకపోయాననే బాధ ఉండకూడదని.. ఆడపిల్లలకు ఐదేళ్ల లోపు పెళ్లి చేస్తారు.
సాధారణ పెళ్లిళ్లు ఎలా చేస్తారో ఈ పెళ్లిళ్లు కూడా అలాగే చేస్తారు. ఊర్లో పెద్దలు ఒక సమావేశం పెట్టుకుని ఈ పెళ్లిళ్లు ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయిస్తారు.ఇలా ఆప్రాంతంలో పుట్టిన ప్రతి అమ్మాయికి మూడు పెళ్లిళ్లు తప్పనిసరిగా చేస్తారు. మరి.. ఈ వింతైన సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.