చాలా మందికి విహారయాత్రలు అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. కొండలు, అడవుల్లో జర్నీ చేయడానికి ఇష్ట పడుతుంటారు. మరికొందరు అలలపై తేలియాడూ.. సముద్రంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం విశాఖ తీరం సిద్ధమైంది. వైజాగ్ పోర్టు నుంచి ఓ సరికొత్త విలాసవంతమైన ఓడ వందలమంది ఔత్సాహికులతో తన మొదటి ప్రయాణం మొదలుపెట్టింది. విశాఖ నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి కార్డేలియా క్రూయిజ్ నౌక వెళ్తుంది. నీలి వర్ణంలో ఉండే సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ నౌక స్వాగతం చెబుతోంది. మరి.. సముద్రంలో ఇంద్రభవనం లాంటి ఈ నౌక ప్రత్యేకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కార్డేలియా క్రూయిజ్ సంస్థ నడుపుతున్న ఈ విలాసాల నౌకను సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనోచ్చు. హోటళ్లకు లోని సౌకర్యలతో పాటు అదనంగా మరికొన్ని వసతులు కల్పిస్తూ.. అడ్వెంచర్ యాక్టివిటీస్ నీ కూడా ఇందులో చూడొచ్చు. విశాఖ నుంచి చెన్నైకు మూడు రాత్రులూ నాలుగు పగళ్లుగా ఈ పర్యటక ప్యాకేజీ ఉంటుంది. ఇందులో ఒక్కేసారి 1500-1800 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఈ పర్యటక ప్యాకేజీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ షిప్ లో విశాఖ నుంచి చెన్నై వెళ్లేందుకు దాదాపు 36 గంటల సమయం పడుతుంది. మొత్తం 11 అంతస్తులు ఉండే ఈ నౌకలో ఎన్నో అధునాత సౌకర్యాలు ఉన్నాయి. ఈ షిప్‌లో స్టే రూమ్ ధర సుమారు 25వేలు, సముద్రాన్ని వీక్షించే సౌకర్యం ఉన్న రూమ్ ధర 30వేలు. మినీ సూట్ 53వేల700 గా ఉందంట. నౌకకు కింది భాగంలోని రెండు అంతస్తులు సరుకులకు పోగా మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు ఉంటాయి.
ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు శుభవార్త.. గంటన్నర వ్యవధిలోనే సర్వదర్శనం!
ఈ నౌకలో మొత్తం 796 క్యాబిన్లు ఉన్నాయంట. 313 ఇన్ సైడ్ స్టేట్ రూమ్స్, 414 ఓషన్ వ్యూ రూమ్స్,63 బాల్కానీ రూమ్స్, 5 సూట్ రూమ్ లతో పాటు షాపింగ్ మాల్, థియేటర్, కామెడీ షోల కోసం వేదికలు, జిమ్, ఈతకొలను వంటి మొదలైన అన్ని సౌకర్యాలు ఈ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.10వ అంతస్తులో డాబాలాంటి డెక్ ఉంటుంది. 11వ అంతస్తులో సూర్యోదయం, సూర్యాస్తమయాలని చూసేందుకు ప్రత్యేకంగా మరో డెక్ నీ ఏర్పాటు చేశారు. ఇందులో నిల్చుని అనంత సాగరాన్ని వీక్షించడం.. ఓ అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి.
ఇదీ చదవండి: ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్న తల్లికోతి.. వీడియో వైరల్
సముద్రం మద్యలో 4రోజుల పాటు అలా లగ్జరీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుటుంది. కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అయినప్పటికి.. డిఫరెంట్ లైఫ్‌ను చూడొచ్చు. క్రూజ్‌లో ప్రయానం చేస్తూ.. అన్ని వసతులతో అలా మజా చేయడం అనేది ఓ మంచి మధురానుభూతి. మరి.. సముద్రంలో ఇంద్రభవనంలా కనిపిస్తున్న ఈ క్రూయిజ్ నౌక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.