గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేగింది. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది హాస్పిటల్ పాలయ్యారు.
విషవాయువు లీకై 12 మంది ప్రమాదం జరిగిన రోజున చనిపోగా.. మరొక ముగ్గురు కొద్దిరోజుల తర్వాత కన్నుమూశారు. స్టైరిన్ పీల్చిన కారణంగా గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అప్పటి నుంచి గ్యాస్ లీకేజీ అంటేనే విశాఖ వాసులు హడలిపోతున్నారు. తాజాగా విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ ఘటన మరోమారు కలకలం రేపింది.
వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటన విశాఖ వాసులను మరోమారు ఆందోళనకు గురిచేసింది.