ఉరుకుల పరుగుల జీవితంలో.. ఓ అమ్మ ఆశయం మధ్యతరగతి జీవుల కడుపునింపుతోంది. ఒక్క పూట తిండికోసం వందలకు వందలు కర్చుపెట్టాల్సి వస్తున్న ఈ రోజుల్లో.. అమ్మ చూపిన బాటలో నడుస్తూ.. రూ. 20 రూపాయలకే తిన్నంత భోజనం పెడుతున్నాడు సివిల్ ఇంజినీర్ మణి. అయితే ఇది ఏ రాష్ట్రంలోనో అనుకుంటే మీరు పొరపడినట్లే.. అవును 20 రూపాయలకే తిన్నంత రుచికరమైన భోజనం లభించేది మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ ల్లో. నిత్యవసర సరకుల ధరలు పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంత తక్కువ ధరకే భోజనం పెడుతున్న మణిని పలకరించింది సుమన్ టీవీ. ఇలా తక్కువ ధరకే కడుపు నిండా భోజనం పెట్టడం గురించి పలు విషయాలు పంచుకున్నాడు మణి.
ఈ రోజుల్లో ఒక్క పూట భోజనం తినాలి అంటే తక్కువలో తక్కువ 100 రూపాయాలను ఖర్చు అవుతుంది. మరి అలాంటి భోజనాన్ని అంతే రుచితో, అంతే క్వాలిటీతో అందిస్తున్నాడు ఈ కర్నూల్ వ్యక్తి. అతడి పేరు మణి.. సివిల్ ఇంజినీర్. బయటి దేశాల్లో ఉద్యోగ ఆఫర్ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళకుండా తన తల్లి ఆశయాన్ని నెరవేరుస్తూ.. సామాన్యూల కడుపు నింపుతున్నాడు. మరి ఎంతో మంది మధ్యతరగతి ఆకలిని అతితక్కువ ధరకే తీరుస్తున్న మణిని పలకరించింది సుమన్ టీవీ. ఈ మహత్తరమైన యాగం వెనక ఉన్న అసలు విషయాలను చెప్పుకొచ్చాడు.
“మా అమ్మానాన్న పేదలకు సేవ చేసేవారు. వారి నుంచే నేను ఇతరులకు సాయం చేయడం నేర్చుకున్నాను. నా వంతుగా ఇతరులకు ఏదైనా సహాయం చెయ్యాలి అన్నదే నా ఉద్దేశం. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నాకు ఇందులో ఒక్క రూపాయి మిగలకపోయినా పర్లేదు. వారి కడుపు నిండితే చాలు నాకు తృప్తిగా ఉంటుంది. ఇక ఇక్కడికి ప్రతీ రోజు 250 మంది వస్తుంటారు. అదీకాక రోజూ 10 మంది అనాథలకు ఉచితంగా భోజనం పెడుతుంటాను. 20 రూపాయలకే వారికి తిన్నంత భోజనం పెడతాను. ఇక పోతే రూ. 70 రూపాయాలకే చికెన్ కర్రీతో పాటుగా బిర్యాని రైస్ కూడా దొరకుతుంది” అని మణి చెప్పుకొచ్చాడు.
అయితే ఇంత తక్కువ ధరకే పెడుతున్నాడు అంటే రుచి తక్కువ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ రుచిలోగానీ, క్వాలిటీలోగానీ ఎక్కడా తగ్గేది లే అంటున్నాడు మణి. అదీకాక అక్కడకి వచ్చేవారు సైతం మణి వంటలను ఎంతో గొప్పగా మెచ్చుకుంటున్నారు. ఇంత తక్కువ ధరకే మధ్యతరగతి పేదల కడుపు నింపడం నిజంగా గొప్ప విషయం అంటూ అతడిని పొగుడుతున్నారు. మరి ఇంత తక్కువ ధరకే కడుపునిండా రుచికరమైన భోజనం పెడుతున్న మణిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.