ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధలు విధిస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలలో, ఐసీపీ సెక్షన్లలో ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి.
ఈ రోజుల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు విధిస్తున్నారు. అలానే ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్లలో పలు మార్పులు చేసి.. కఠిన సవరణలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మీ వాహనాన్ని ఇతరులకు ఇచ్చారంటే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీ బైక్, కారు వంటివి మైనర్లకు ఇచ్చారంటే జైలుకు వెళ్లాల్సిందే. ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకోస్తుంది. ఇటీవలే ఐపీసీ సెక్షన్ 304 ఏ ను సవరిస్తో.. 304 బీని ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఒక వ్యక్తి తన వాహనాన్ని ఫ్రెండ్ కి అడిగే సరికి కాదనలేక ఇచ్చాడు. అతడు వాహనంపై వెళ్తూ.. ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఎదురు వాహనం దారుడు మరణించాడు. వాహనం నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో వాహనం నడిపిన వ్యక్తితో పాటు యజమానిపై ఐసీపీ సెక్షన్ 304(బి) కింద కేసు నమోదు చేశారు. దీంతో బైక్ ఇచ్చిన వ్యక్తి లబోదిబోమన్నాడు. ఇలా వివిధ రకాల కేసుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి , మైనర్లకు వాహనం ఇచ్చి.. ప్రమాదానికి కారణమైతే.. సదరు వాహన యజమానిపై కూడా 304(బి) కింద కేసు నమోదు చేస్తున్నారు. ఈ సెక్షన్ గురించి తెలిసిన వారు బెంబేలెత్తిపోతున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన, ప్రమాదానికి కారుకుడైన డ్రైవరుపై ఐపీసీ సెక్షన్ 304(ఏ) కింద కేసు నమోదు చేస్తారు. ఇందుకుగాను దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. ఇటీవలే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చట్టంలో సవరణ చేసి 304(బి)ను ఏర్పాటు చేసింది. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా కూడా నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీసినట్లు భావించి.. దాదాపు హత్య కేసుతో సమానంగా దీనిని సవరించారు.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు. గతంలో 304(ఏ) కింద రెండేళ్ల పాటు శిక్ష పడేది. అయితే తాజాగా కొత్త సవరణ చట్టం 304(బి) ప్రకారం 10 ఏళ్లు శిక్ష పడుతుంది. అంతేకాక అరెస్టైన వెంటనే బెయిల్ కూడా రావడం జరగదు. దీంతో ఇప్పుడు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. వాహనం ఇతరులకు, మైనర్లకు, లైసెన్స్ లేనివారికి ఇచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకుని జైలు పాలు కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్లపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయంటున్నారు.
అయితే పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం అంటున్నారు. ఇది లేకుంటే లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వాళ్లు, మైనర్లు, మద్యం తాగి నడిపే వాళ్ల ఎక్కువవుతున్నారని. ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ కి భయపడి ఇతరులకు వాహనాలు ఇవ్వడానికి యజమానులు జంకుతున్నారు. ఇంకా చాలా మందికీ ఈ కొత్త సెక్షన్ గురించి తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మరి.. ఈ సెక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.