పూర్వం చాలా గ్రామాల్లో కట్టుబాటులు, సంప్రదాయాలు, ఇతర నియమ నిబంధనలు ఉండేవి. అలానే వాటిని అమలు చేసేందుకు గ్రామ పెద్దలు కొందరు ఉండేవారు. ఎవరైనా గ్రామ కట్టుబాటులను అతిక్రమిస్తే.. వారికి వివిధ రకాల శిక్షలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఊరి నుంచి కూడా వెలివేస్తారు. నేటి ఆధునిక యుగంలో కూడా అలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పూర్వం చాలా గ్రామాల్లో కట్టుబాటులు, సంప్రదాయాలు, ఇతర నియమ నిబంధనలు ఉండేవి. అలానే వాటిని అమలు చేసేందుకు గ్రామ పెద్దలు కొందరు ఉండేవారు. ఎవరైనా గ్రామ కట్టుబాటులను అతిక్రమిస్తే.. వారికి వివిధ రకాల శిక్షలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఊరి నుంచి కూడా వెలివేస్తారు. అయితే నేటి సాకేంతిక యుగంలో అలాంటి సంప్రదాయాలు, కట్టుబాటులు చాలా వరకు తగ్గాయి. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుల పెద్దలు అనాగరిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా నెల్లురూ జిల్లాలో అలాంటి అమానుష ఘటన జరిగింది. గ్రామ పెద్దలు నాలుగు కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరించారు. మరి.. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం టి.వి కండ్రిగలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఓ చిన్న ఘర్షణ కారణంగా నాలుగు కుటుంబాలను గ్రామస్థులు వెలివేశారు. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి పండగ సందర్భంగా టి.వి. కండ్రిగ గ్రామంలో డీజే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ డీజే ప్రదర్శన వద్ద రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. అది కాస్తా పార్టీల రంగులు పులుముకుని వైసీపీ, జనసేన మద్దతుదారులు మధ్య గొడవగా మారింది.
చిన్న గొడవ కాస్తా పెద్దది గా మారి ఓ వర్గం వారు నాలుగు కుటుంబాలను టార్గెట్ చేశారు. వారిని ఊరి నుంచి బహిష్కరిస్తున్నట్లు పరోక్షం తెలిపారు. అలానే ఆ నాలుగు కుటుంబాలకు తాగునీరు, కిరాణా సరకులు, ఇతర మందులు ఇవ్వొద్దని గ్రామంలో హుకుం జారీ చేశారు. దీంతో గ్రామస్థుల నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడంతో ఆ నాలుగు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఈ కుటుంబాలు పోలీసులను ఆశ్రయించి.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు.
అయితే జనసేన మద్దతుదారులం కాబట్టే.. తమను టార్గెట్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా కులాలు, పార్టీల వ్యహారాలు ఆ కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే నేడు గ్రామానికి రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లనున్నట్లు సమాచారం. తాము ఈ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరి.. ఈ అమానుష చర్యపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.