మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. స్థానికంగా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు హర్షకుమార్ తనయుడిపై కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపాయి. ఓ యువతిని వేధించాడనే ఆరోపణలతో శ్రీరాజ్ పై కేసు నమోదు అయ్యింది. రాజమండ్రిలోని ఓ హోటల్ వద్ద యువతిని ముద్దు పెట్టుకోబోయాడంటూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
యువతిని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించినందుకు శ్రీరాజ్ పై ఐపీసీ 509, 354డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లోని వారి ఫామ్ హౌస్‌లో పలు రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. వాటిని వాళ్లు పెంచుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం వారి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తుంటారు. వారి వద్ద తెలుగులో మాట్లాడే మ్యాక్సీ అనే మకావ్ కూడా ఉంది.
కార్న్ స్నేక్ ని కూడా పెంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆ జంతువులకు సంబంధించి కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిని ఫామ్ హౌస్ లలో పెంచుకోవచ్చా? అన్నింటికి కావాల్సిన అనుమతులు ఉన్నాయా లేవా? అనే కోణంలోనూ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీరాజ్ పై కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.