ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఇవాళ ఆయన హస్తినలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ప్రముఖ రాజకీయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ నాయకత్వంలో బీజేపీ మరింతగా దూసుకుపోవాలని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆకాంక్షించారు. కిరణ్ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉందని.. వారి ఫ్యామిలీలోని మూడు తరాలు ఆ పార్టీకి సేవలు అందించారని చెప్పారు.
కిరణ్ కుమార్ చేరికతో బీజేపీ మరింత బలపడిందని అరుణ్ సింగ్ చెప్పారు. ఇకపోతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీకి కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పలు రాజకీయ పరిణామాల అనంతరం అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి ఏపీకి ఆయన ఆఖరు సీఎంగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే తెలంగాణ విభజన జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తిరిగి పొలిటికల్ కెరీర్‌ను ఆరంభించాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇవాళ బీజేపీ కేంద్ర నేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
#WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr
— ANI (@ANI) April 7, 2023