ఇటీవల కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఏ రోజు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీ లో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, లోకేష్ ను చంపడానికి ప్రయత్నించారంట.. అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా తాను సీఎం పదవిని వదులుకుని కాపుల్ని అయినా సీఎం చేస్తానంటూ చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మాటల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోటులు చవి చూశారు. ఎందరో ప్రత్యర్ధులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. ప్రస్తుతం మాత్రం ఏపీలో చంద్రబాబుకు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పవచ్చు. అందుకే ప్రజలను లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారని కొందరంటున్నారు. తన రాజకీయజీవితంలో ఎందరో రాజకీయ ప్రత్యర్ధులను చూసిన చంద్రబాబు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయల ముందు మాత్రం నిలబడలేకపోతున్నడని వాదన వినిపిస్తోంది. చివర వరకు పోరాడే నైజాం చంద్రబాబుది.. అందుకే కాబోలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీద ఉన్నారు. అందుకే రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు.
‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈక్రమంలో గత రెండు రోజు నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల్లో చంద్రబాబు అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ వైసీపీ వాళ్లు తలచుకుని ఉంటే తనను, లోకేష్ ను చంపేవారంట” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలానే టీడీపీని గెలిపించకుంటే మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుపై మరో ఆసక్తిరమైన విషయం ప్రచారం జరుగుతోంది. తాను సీఎం పదవి వదులుకుని కాపుల్ని సీఎం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధమంటూ చంద్రబాబు అన్నట్లు చెబుతున్న ఈ సంకేతం చూస్తే.. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిందేనా? అనే ఓ చర్చ మొదలైంది. “పవన్ కళ్యాణ్..చంద్రబాబును సీఎం చేసేందుకు పనిచేస్తారు” అంటూ వైసీపీ వాళ్లు చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఈ సంకేత పంపారా? అనే సందేహం మొదలయ్యింది. అదే సమయంలో పవన్ కు సీఎం పదవి ఇచ్చి.. టీడీపీ మద్దతిస్తే రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో కేవలం నాలుగైదు శాతం జనాభా కలిగిన రెండు కులాల చేతిలోనే అధికారం ఉండిపోవడంపై చాలా మందిలో అసంతృప్తి ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా దాదాపు 20 శాతం జనాభా ఉన్న కాపుల్లో ఈ అసంతృప్తి కాస్త ఎక్కువగా ఉంది ప్రచారం జరుగుతోంది. దీన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా గోదావరి జిల్లాల పర్యటనలో కాపుల్ని సీఎం కుర్చీలో కూర్చపెట్టేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజా నిజాలు ఏమిటనేది పక్కన పెడితే.. వైసీపీని గద్దె దించేందుకు దేనికైనా సిద్ధమనే విధానంలో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.