ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగాడు.
రవాణా సాధనాలలో బస్సులు ప్రముఖ రవాణా సాధనం. నిత్యం వందల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు అనుకోని ప్రమాదాల భారిన పడుతున్నాయి. తక్కువ రేట్లకే టికెట్స్ తీసుకొని ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఆర్టీసీ అందుబాటులో లేనప్పుడు దూరప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎన్నుకుంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలావరకు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నాయి. రాత్రి,పగలు తేడాలేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. వీరు చేసే సర్వీసులు ప్రభుత్వ అనుమతితోనే కాబట్టి అన్ని విధాలుగా బస్సు ప్రయాణం ప్రజలకు అనుకూలమైనది. కాగా ఊహించని ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలాంటిదే ప్రకాశం జిల్లాలో ప్రయాణించే బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవరు ప్రయాణికులను అప్రమత్తం చేసి కాపాడాడు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లాలో ఘఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన బస్సు డ్రైవర్ ప్యాసెంజర్స్‌ని అప్రమత్తం చేశాడు. బస్సులోని ప్రయాణికులను దింపేశాడు. అప్పటికే చాలావరకు బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల లగేజ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్యాసెంజర్లకి ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు తమ సామాగ్రి మంటల్లో కాలిపోయినందుకు దిగులు చెందారు. కానీ ప్రాణాలు రక్షించినందుకు డ్రైవర్‌ను మెచ్చుకున్నారు.
బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిపోయింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నాట్లు గుర్తించారు. జాతీయ రహదారిపై హైటెన్షన్ వైర్లు బస్సుకు తగలడంతో బస్సులో మంటలు అంటుకున్నాయని సమాచారం అందింది. స్థానికుల సమాచారంతో జరుగుమల్లి పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రయాణికుల్ని ఇతర ట్రావెల్స్ బస్సులలో క్షేమంగా వారి గమ్యస్థానాలకు పంపించారు. ప్రయాణికుల్లో చాలామంది హైరదాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.