ఎండకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్, ఎండల తీవ్రతకు, రసాయనాల పేలుడు వంటి తదితర కారణాలతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
నెల్లూరు జిల్లా చేజర్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చేజర్ల మండలం మాముడూరు వద్ద ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయలు అయ్యాయి. అలానే ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అలానే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అనుమతులు లేకుండా బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడంతో ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అలానే పేలుడు శబ్దాల ధాటికి చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదాలు జరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు మీ సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.