ఈ మధ్యకాలంలో కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ఎండాకాలంలోఅయితే ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకంటున్నాయి. ఖరీదైన కారు అయిన సరే ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ఎండాకాలంలోఅయితే ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకంటున్నాయి. ఖరీదైన కారు అయిన సరే ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. కారులో నుంచి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వాళ్లు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాలప ప్రకారం..
నంద్యాలలోని రైతు నగర్ ప్రాంతం సమీపంలోని బైపాస్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా కారులో మంటలు వచ్చాయి. అయితే అందులో ప్రయాణిస్తున్న వారు భయంతో కారులో నుంచి దిగి బయటకు పరుగులు తీశారు. కారుకి దూరం వెళ్లిన అనంతరం ఫైరింజన్ వారికి సమాచారం అందించారు. అయితే అందరూ చూస్తుండగానే కారులో మంటలు చెలరేగాయి. అగ్నిమాప సిబ్బంది వచ్చే సరికే నడ్డిరోడ్డుపై కారు దగ్ధమైంది.
నంద్యాల నుండి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొంతకాలం నుంచి ఎండలు బాగా దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలానే కారు ఇంజిన్ లో ఏదైన సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగి ఉండొచ్చిని మరికొందరు అంటున్నారు. అటువైపు వెళ్తున్న వారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇక మరోవైపు వాహనాల్లో మటంలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండకాలంలో సర్వీసింగ్ చేయకుండానే వందల కిలోమీటర్లు నడపడం వలన కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయని కొందరు అంటున్నారు. అలానే కార్ల టైర్లు సరిగ్గా లేకపోవడం, టైర్లకు రోడ్డుకు మధ్య స్కార్క్స్ ఏర్పడి కూడా మంటలు ఏర్పడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
ఇక వాహనాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫోమ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫాబ్రిక్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందంట. తాజాగా నంద్యాల జరిగిన ఈ కారు ప్రమాదానికి కూడా పై వాటిలో ఏదో ఒక కారణం కావచ్చని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా తరచూ రోడ్డుపై వాహనాలు కాలిపోతున్న ఘటనలకు ప్రధాన కారణాలు ఏమిటి అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.