ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగి.. పక్కనే పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు అంటుకున్నాయి. ఆ మంటల ధాటికి ఆరు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
9 buses gutted after a massive fire mishap took place at #Ongole pic.twitter.com/uRRbTJC6rA
— Siddhu Manchikanti (@SiDManchikanti) March 1, 2022