ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. రాజకీయ నాయకులంటే మాటల వరకే ఆపేస్తారంటుకుంటే పొరపాటు. సినిమాల్లో నటీనటుల్లా ఫైట్లు చేయగలరు. అలాంటి సన్నివేశం రియల్ గానే చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఎగెరెగిరి దూకుతూ చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
ఇప్పటివరకు రాజకీయ నాయకుల మధ్య వైరమంటే.. ఒకరిపై మరొకరు విమర్శల వరకే. కాకుంటే కొన్ని సందర్భాల్లో హద్దు మీరు బూతులు మాట్లాడిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ప్రజల సాక్షిగా బాహాబాహీకి దిగుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం మానేసి.. వివిధ కారణాలతో రచ్చకెక్కుతున్నారు. ఒకరిపై మరొకరు దాడికి దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో అలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అధికార.. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ.. వైసీపీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. టెండర్లను అధికార పార్టీకి చెందిన వారికే కట్టబెడుతున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనిని వైసీపీ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. అది కొట్టుకునే వరకు దారితీసింది. ఇంకేముంది సినిమాల్లో సన్నివేశాల్లో ఒకరిపై మరొకరు ఎగెరెగిరి దూకుతూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో.. పలువురు కౌన్సిలర్ల చొక్కాలు చిరిగాయి. వీరిని కట్టడిచేయలేక ఛైర్ పర్సన్ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ.. వైసీపీ కౌన్సిలర్లు చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. #Guntur #Tenali #SumanTV pic.twitter.com/9zYK3jFjj9
— SumanTV (@SumanTvOfficial) March 31, 2023