ప్రతి ఒక్కరి జీవితానికి మూల కారణం తల్లిదండ్రులు. అమ్మ.. నవ మాసాలు మోసి మనకు జన్మనిస్తుంది. నాన్న.. తన ఇష్టాలను పక్కన పెట్టి.. మన సంతోషమే తన సంతోషంగా భావించి అల్లారు ముద్దుగా పెంచుతాడు. అంతలా ప్రేమగా పెంచిన అమ్మనాన్నలపై ఆస్తి కోసం కొందరు కన్న కొడుకులు దారుణాలకు తెగ బడుతున్నారు. తాజాగా ఓ పుత్ర రత్నం.. ఆస్తి అంతా తన పేరున రాయలేదని తండ్రిపై పగ పెంచుకుని, అన్నం పెట్టకుంటా హింసిస్తున్నాడు. ఆ కష్టాలను భరించలేని ఆ తండ్రి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకి చెందిన ఓ వృద్ధ దంపతులు కొడుకు వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధుడి భార్య ఏడాది కిందట మరణించింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ వృద్ధాప్యం కారణంగా తిండికి కోసం కొడుకును ఆశ్రయించాడు. తండ్రికి తిండి పెట్టి.. తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన కొడుకు ఆస్తి ఇవ్వమంటూ వేధింస్తున్నాడు. తన పేరున ఆస్తి అంతా రాసిస్తేనే తిండి పెడతామంటూ వేధిస్తున్నాడు. తాజాగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగం ఆ వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆస్తంతా రాసిస్తేనే అన్నం పెడతామంటూ కన్నకొడుకు కర్కశంగా వ్యవహరిస్తున్నాడని.. ఆ ముసలి తండ్రి ఏ దారీ లేక ఎస్పీని ఆశ్రయించారు. “ఆసరాగా ఉండాల్సిన నాకొడుకు, కోడలు వారి పేరున ఉన్న ఆస్తి రాసిస్తేనే తిండి పెడతామంటూ వేధిస్తున్నారు. నాకు న్యాయం చేయండి” అంటూ ఆ పెద్దాయన. స్పందన కార్యక్రమంలో అధికారులను వేడుకున్నారు. మరి.. ఈఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.