రాజకీయాలు, సినిమా రంగంలోకి ఒక్కసారి ఎంటరయితే.. ఇక సామాన్యుల మాదిరి జీవితం గడపడం చాలా కష్టం. బతికినంత కాలం అదే ప్రపంచంలో ఉండాలనుకుంటారు. ఆ గుర్తింపు, హోదాను వదిలి.. సామాన్యుల మాదిరి జీవితం గడపాలంటే.. చాలా కష్టం. అది సాధ్యం కాకే.. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అవకాశాలు రాని సమయంలో.. నిరాశలో కూరుకుపోయి.. జీవితాలను అంతం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. పదవి, పేరు, గుర్తింపు లేకుండా బతకలేరు. చాలా కొద్ది మంది మాత్రమే వీటన్నింటిని వదిలేసుకుని.. సామాన్య జీవితం గడుపాతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.
ఒకప్పుడు రాజకీయాల్లో అగ్ర నేతగా రాణించారు మాజీ మంత్రి రఘువీరా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులు.. ఎమ్మెల్యే, ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, జయహో నినాదాలు.. విపరీతమైన పేరు ఇలా అన్నింటిని అనుభవించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా దూరమయ్యి.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. జీవిత మలి సంధ్య వేళ.. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా గడుపుతూ.. వారు చేసే అల్లరి చూస్తూ.. మురిసిపోతున్నారు. అప్పుడప్పుడు వారితో కలిసి ఆయన చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఇక తాజాగా మనవరాలితో కలిసి డ్యాన్స్ చేసున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. దీనిలో ఆయన మనవారాలితో కలిసి..ఓ పాప్ సాంగ్‌్ డ్యాన్స్ చేశారు రఘువీరా. ఒకప్పుడు ఖద్దరు దుస్తుల్లో కనిపించిన ఆయన.. ఈ వీడియోలో సామాన్యుడి మాదిరి కనిపించారు. ఇక మనవరాలితో కలిసి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అంతటి వైభోగం అనుభవించి.. ఇప్పుడిలా సామాన్యంగా బతకడం అందరి వల్ల కాదు. కానీ మీరు వాటన్నింటిని జయించారు.. గ్రేట్ సార్ అంటు కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
Joyful moments with my Granddaughter.. pic.twitter.com/xD0pBTASj9
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 8, 2022