ఆరుగాలం పండించే పంటకు అడుగడుగునా సమస్యలను ఎదుర్కొంటున్నాడు రైతు. దుక్కు దున్ని, పంట పండించి, మనం అన్నం పెట్టే రైతు.. ప్రతి విషయంలోనూ మోసపోతున్నాడు. పంట పండించడంలో తమకు ఎదురౌతున్న సమస్యల గురించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు.
దేశానికి వెన్నుముక రైతే. ఈ విషయం తెలిసినా కూడా రైతుకు సరైన న్యాయం జరగడం లేదు. ఆరుగాలం పండించే పంటకు అడుగడుగునా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దుక్కు దున్ని, పంట పండించి, మనం అన్నం పెట్టే రైతు.. ప్రతి విషయంలోనూ మోసపోతున్నాడు. విత్తనంలో నాసిరకాలు, ఎరువుల్లో మోసాలు.. చివరికీ పంటకు అందించే నీరు సైతం ఇవ్వలేక, నేల చూపులు చూస్తున్న పంటలను చూసి ఉసూరుమంటున్నాడు. పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక, ఉరిబోసుకుంటున్నాడు. దేశంలో ఎవ్వరూ మారినా… రైతు పరిస్థితులు మాత్రం మారడం లేదు. తమకు అందించాల్సిన వనరులు ఇవ్వడం లేదని రైతులు లబోదిబోమంటున్నా అధికారులు స్పందించడం లేదు.
ఇలా తమ సమస్యను ఎన్ని సార్లు అధికారుల వద్దకు తీసుకెళ్లినా స్పందించడం లేదని భావించిన కొందరు రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ ఘటన కాకినాడలో జరిగింది. కాకినాడలోని తాళ్లరేవు మండలంలోని కొత్త కాలువ ప్రాంతాల్లోని పొలాలకు నీరు అందడం లేదని కొంత మంది రైతులు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొర పెట్టుకున్నారు. పలుమార్లు విన్నవించినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పచ్చని పంట పొలాల్లో ఓ రైతు తన బైక్ తో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఏపుగా ఎదిగిన పంట పొలంలోనే బైక్ ఆందోళన చేపట్టాడు. తమ పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఈ వినూత్న నిరసనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.