సీనియర్ కార్టూనిస్ట్ పాప శనివారం మరణించారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. పాప అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. తెలుగు మీడియాలో ప్రముఖ కార్టూనిస్ట్ గా ప్రసిద్ది చెందిన ఆయన ఎన్నో కార్టూన్లు గీశారు. చదువరులను ఆకట్టుకునే ఆయన వ్యంగ్య కార్టున్ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి.
ఆయన యుక్తవయసులో ఉన్నప్పుడు వసుధ, ఆంధ్రపత్రిక, జోకర్, వార, మాస పత్రికలకు కార్టూనిస్ట్ గా పని చేశారు. ఇక శివరామరెడ్డి చదువు పూర్తయ్యాక విశాఖ్ టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గా కొంత కాలం పని చేసి ఫైర్ ఆర్ట్స్ కోర్సు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఎన్జీఆర్ఐలో ఆర్టిస్టుగా పని చేసిన కొంత కాలం తర్వాత బాపు, రమణ సలహతో 1975లో ఈనాడు దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పని చేశారు. అయితే శివరామరెడ్డి మొదటి కార్టూన్ ఆంధ్రపత్రికలో ప్రచురితమవ్వడం విశేషం. సీనియర్ కర్టూనిస్ట్ పాప మరణింపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Surya: ఓ సినిమా కోసం సూర్య ఇంత కష్టపడతాడా? హేట్సాఫ్ సూర్య!