కొడాలి నాని గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ప్రతర్థుల మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడతారు కొడాలి నాని. గుడివాడ నియోజక వర్గం నుంచి గెలుపొంది… వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రిగా పని చేశారు. కొడాలి నాని తొలుత తెలుగుదేశంలో ఉన్నప్పటికి.. తర్వాత వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరాడు. నిర్మోహమాటంగా.. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ప్రభుత్వాన్ని కానీ, సీఎం జగన్‌ని కానీ ఎవరైనా విమర్శిస్తే.. ఆయన చూస్తూ ఊరుకోరు. వెంటనే రంగంలోకి దిగి.. వారికి తగిన విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఏపీ రాజీకీయాల్లో దూకుడుగా వ్యవహరించే అతికొద్ది మంది నేతల్లో కొడాలి నాని ఒకరు.
మినిస్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు నాని. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య, కుమార్తెతో కలిసి ఓ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు.. ఆయనకు స్వాగతం పలికి.. తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో కొడాలి నాని కుమార్తె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెను చూసినవారంతా.. ఎంత చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.