చాలామందికి దైవ భక్తి ఉంటుంది. కానీ కొందరి దైవభక్తితో పాటు జ్యోతిష్యశాస్త్రాలపై కూడా నమ్మకం ఉంటుంది. అందుకే తమకు శని ప్రభావం లేదా ఇతర దోషాలు ఉన్నాయని తెలిస్తే చాలు.. వాటికి పరిహారంగా అనేక పూజాలు చేస్తారు. కొన్ని రకాల ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే కొందరు భక్తితో ఉంటారు కానీ ఇలాంటి శాస్త్త్రాలు పెద్ద పట్టించుకోరు. శ్రమనే నమ్ముకుంటారు. అలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు. అయితే ఈ మధ్య ఆయనకూడా శాస్త్రాలు-దోషలు వంటివి నముతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును మనం ఎప్పుడు చూసినా ఒకే రకంగా కనిపిస్తారు. కానీ గత వారం రోజులుగా చంద్రబాబులో సడన్ ఛేంజ్ కనిపిస్తుంది. ఆయన చూపుడు వేలుకి కొత్తగా ఉంగరం కనిపిస్తుంది. ఎప్పుడు ఉంగరాలు ధరించని ఆయన చేతికి ఇటీవల ఉంగరం కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి నారాచంద్రబాబు నాయుడు. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఆయన చూడని అత్యుతన్నత శిఖరాలు లేవు. నేలకు కొట్టిన బంతిలా.. ఎంత పడితే అంత ఎత్తుకు లేవాలనుకునే మనస్తత్వం. వీటితో పాటు బాబుకు దైవభక్తి కూడా ఉంది. కానీ మూఢ భక్తి లేదు. స్వామీజీల దగ్గరకు కూడా వెళ్ళరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ నమ్మకాలనే నమ్ముతున్నరని ప్రచారం జరుగుతుంది. ఇప్పడు ఆయన ఎడమ చేతి చూపుడు వేలికి కనిపిస్తున్న ఉంగరంపై సోషల్ మీడిాయాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి
అయితే ఈ ఉంగరం గురించి చంద్రబాబు నాయుడే స్వయంగా తెలిపారు. “ఈ ఉంగరంలో ఓ చిప్ ఉంది. ఇది ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. గుండె పనితీరు, సరైన నిద్రపోతున్నామా లేదా మొదలైన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పడు ఈ ఉంగరం తెలియజేస్తుంది” అని ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. మరి.. చంద్రబాబు ఉంగరం ధరించడంపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.