Dwajasthambam: దేవుడి ముందు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. తాడు తెగడంతో ధ్వజ స్తంభం భక్తులపై పడింది. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి వారి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవుడి ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుండగా తాడు తెగింది. దీంతో స్తంభం ఒరిగిపోయి భక్తులపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో పాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్తను వద్దనుకుని ప్రియుడిపై మోజు.. ప్రియుడు ఏం చేశాడో తెలుసా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.