దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో చనిపోతున్నారు. ఇటీవల విమాన, రైలు ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ఇందుకు మూల కారణం అని అధికారులు చెబుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మద్య పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ ని భీమడోలు వద్ద బోలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రైలు ఇంజన్ బాగా దెబ్బతిన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 5 గంటపాటు రైలు నిలిచిపోయింది. బోలెరో వాహనదారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దురంతో ఎక్స్ ప్రెస్ వస్తున్న సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటు వేశారు. ఆ సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన కొంతమంది రేల్వే గేటును ఢీ కొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో రైలుకు ఢీ కొట్టడంతో ఆ వాహనం ధ్వసం అయ్యింది.. అలాగే రైలు ఇంజన్ దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని అక్కడే వదిలివేసి సదరు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన రైల్వే అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని వేరే ఇంజన్ అమర్చే ప్రయత్నం చేశారు.
ప్రమాదం లో రైలు ఇంజన్ మాత్రమే దెబ్బదిన్నదని.. వెంటనే రైల్ ఇంజన్ మార్చి సిద్దం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హానీ జరగలేదని అన్నారు. ఇక కొంతమంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని తమ గమ్యస్థానం చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే అంత వేంగా బొలెరో వాహనాన్ని ఎందుకు నడిపారు.. రైలు కి ఢీ కొట్టిన వెంటనే ఎందుకు పారిపోయారు.. ఒకవేళ అందులో వచ్చిన వాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటుని ఢీ కొట్టారా? లేదా మద్యం సేవించి వాహనం నడిపారా? అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.