ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కలు ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రల్లో పెను సంచలనాలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత అధికారులు కొద్దిరోజుల పాటు హడావుడి చేసినా.. ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కుక్కల దాడుల్లో పలువురు కన్నుమూశారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీది కుక్కల బెడద రోజు రోజుకీ తీవ్రమైపోతుంది. హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కలు ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రల్లో పెను సంచలనాలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత కూడా పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటం, చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసినప్పటికీ తర్వాత షరా మాములుగానే ఉంటుంది. తాజాగా పాకాల పంచాయతీ కరీంతుల్లాబాద్ ప్రాంతంలో మూడేళ్ల బాలుడిపై కుక్కలు దారుణంగా దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే..
హైదారబాద్ అంబర్ పేట్ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదశలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలన్నా ప్రజలు భయపడిపోతున్నారు. చిన్న పిల్లలు ఒంటరిగా ఎక్కడికైనా పంపాలన్నా తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. తాజాగా పాకాల పంచాయితీ పరిధిలో బాలాజీ, కీర్తన దంపతుల కుమారుడు కవీష్ రాజ్ పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. కవీష్ రాజ్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు దాడికి పాల్పపడ్డాయి.. బాలుడి నుదిటిపై, కళ్లపై, పొట్టపై, ఛాతిపై పళ్లతో గట్టిగా చీల్చాయి. కుక్కల దాడి సమయంలో బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వాటిని తరిమేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు కవీష్ రాజ్. తీవ్రంగా గాయపడ్డ కవీష్ రాజ్ ని స్థానికులు ప్రాథమిక ఆరోగ్యానికి తరలించి చికిత్స చేయించారు.
గత పదిహేను నెలలుగా పాకాల మండల పరిధిలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. ఇప్పటి వరకు 491 మందిపై కుక్కలు దాడి చేశాయని.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పాకాల మండలంలో లింగనపల్లె పంచాయితీ పరిధిలో గురువారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. అగ్రహారం సబ్ స్టేషన్ సమీపంలో ఓ చిరుతపులిని ఆటోలో వెళ్తున్న వాళ్లు గమనించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి కూడా చిరుత పులి కనిపించడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.