వైద్య వృత్తిలో ఉన్నవారిని దేవుళ్లతో సమానంగా చూస్తారు.. దేవుడు మనకు ఆయువు ఇస్తే.. దానికి తిరిగి ప్రాణం పోసే శక్తి వైద్యులకే ఉంది. అందుకే వైద్యో నారాయణో హరీ అని దేవుడితో పోలుస్తుంటారు.
వైద్యో నారాయణో హరీ.. అంటారు. మనిషి కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో పోలుస్తుంటారు. దేవుడు మనకు ఆయువు పోస్తే.. వైద్యులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆయువ పోస్తాడు. అంత గొప్ప వైద్య వృత్తిలో ఉండి కొంత మంది డబ్బు సంపాదనే పరమావధిగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్య సిబ్బంది చేసిన నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా మచిలీపట్నం కి చెందిన శివపార్వతి గత కొంత కాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ వస్తుంది. ఏవో కొన్ని మాత్రలు వేసుకోవడం.. తాత్కాలికంగా ఉపశమనం కలగడం.. మళ్లీ కడుపు నొప్పి రావడం డాక్టర్ వద్దకు వెళ్లి ఏవో మందులు వేసుకోవడం లాంటివి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరే నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా మైలవరం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లింది. వైద్య చికిత్సలు నిర్వహించిన డాక్టర్లు ఆమె గర్భసంచి ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. అంతేకాదు త్వరగా గర్భ సంచి తొలగించాలని సూచించారు. కడుపు నొప్పి భరించలేకపోవడంతో ఆమె ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్దమైంది.
ఇటీవల శివపార్వతికి ఆపరేషన్ చేసిన సదరు వైద్యులు ఆమె కడుపులో సర్జికల్ క్లాత్ మచ్చిపోయి కుట్లు వేశారు. కొన్నిరోజులు హాస్పిటల్ లో ఉన్న శివపార్వతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయింది. ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించిన తర్వాత కూడా శివ పార్వతికి మళ్లీ కడుపు నొప్పి రావడం మొదలైంది. దీంతో పలుమార్లు ఆమె ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు సిబ్బంది స్కానింగ్ చేయగా ఆమె కడుపులో ఏదో ఒక క్లాత్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న శివ పార్వతి మళ్లీ ఆపరేషన్ చేసి మీటరు పొడవు ఉన్న సర్జికల్ క్లాత్ ని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సర్జికల్ క్లాత్ ని ఆమె పొట్టలో మర్చిపోవడంపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న శివ పార్వతి బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేూశారు. మైలవరం లోని సదరు ప్రైవేట్ ఆసుపత్రికి వద్దకు వెళ్లి వైద్యులను ప్రశ్నించారు. తమ ఆరోగ్యాన్ని బాగు చేస్తారని నమ్మి వచ్చిన రోగుల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ ఉంచిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని రోగి బంధువులు స్పష్టం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.